ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసి, ఫిర్యాదు చేసిన అఖిలప్రియ

  • వర్ల రామయ్యతో కలిసి నిమ్మగడ్డను కలిసిన అఖిలప్రియ
  • ఆళ్లగడ్డలో వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు
  • జోగి రమేశ్ బెదిరింపు వీడియోను ఎస్ఈసీకి చూపించిన వర్ల
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యతో కలిసి విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి ఆమె వెళ్లారు. కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గం ఆళ్లగడ్డలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదు చేశానని తెలిపారు. అరాచకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. వర్ల రామయ్య మాట్లాడుతూ, పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ బెదిరిస్తున్న వీడియోను ఎస్ఈసీకి చూపించామని చెప్పారు. జోగి రమేశ్ పై చర్యలు తీసుకోకపోతే ఎస్ఈసీపై నమ్మకం పోతుందని అన్నారు. తొలి దశ పోలింగ్ సందర్భంగా ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు బరితెగించి వైసీపీ కోసం పని చేశారని మండిపడ్డారు.

Bhuma Akhila Priya
Varla Ramaiah
Telugudesam
Jogi Ramesh
YSRCP

More Telugu News